Wednesday, 22 February 2012

జీవామ్రుతము

జీవామ్రుతం ఆవశ్యకత
* దేశీయ ఆవు శ్రేష్ఠ మైనది. దేశీయ ఆవు పేడ, మూత్రం ద్వారా "జీవామ్రుతం" తయారు చేసుకొని భూమాత ఆరోగ్యం కాపాడుతూ, ఆరోగ్యదాయకమైన పంటలు పండించవచ్చు. ప్రజారోగ్య పరిరక్ష్ణకు ఇదే మార్గం.
* దేశీయ ఆవు పెడ భూమి మీద పడితే...... భూమిలో రంధ్రాలు ఈర్పడి...... వానపాముల ద్వారా పంటలకు కావలసిన పోషకాలు అందుతాయి. దీశీయ ఆవు పాలు అమ్రుతం, మూత్రం దివ్యమైన ఔషధం. 1 గ్రాము మట్టిలొ 100 కోట్ల జీవరాశులు ఉంటాయి. దేశీయ ఆవు పేడ, మూత్రం వాడి ఆ జీవరాశిని పెంపొందిచుకోవడం ద్వారా పంటలకు పోషకాలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చు
* ఈ విధంగా 1 దేశీయ ఆవుతో 30 ఎకరాలు సాగుచెయవచ్చు. నీరు, విద్యుత్తు సగనికి సగం ఆదా అవుతాయి. ఎరువుల అవసరమే లేదు,. వాతావరణ కాలుష్యం వుండదు. సాగు ఖర్చ్చులు 80 శాతం తగ్గిపోతుంది. నాణ్యమైన, ఆరొగ్యకరమైన, అన్ని పోషకాలు కలిగిన పంట దిగుబదులు సాధించవచ్చు. వ్యవసాయ రంగంలొ చోటు చేసుసున్న సొక్షోభానికి, ముక్యంగా రైతుల ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారం పెట్టుబడి లేని ప్రక్రుతి వ్యవసాయమే. 



జీవామ్రుతం
కావలసిన పదార్ధాలు:
1) ఆవు పేఅడ  -- 10 కేజీలు
2) ఆవు మూఅత్రం -- 5 నుండి 10 లీతర్లు
3) బెల్లం --- 2 కేజీలు
4) పప్పుల పిండి -- 2 కేజీలు
5) నీరు  --- 200 లీతర్లు
6) పుట్ట మట్టి లేక గట్టు మట్టి --- పిడికెడు
తయారు చేసే విధానం:
తొట్టిలో గాని, డ్రమ్ములో గానీ 200 లీతర్లు నీటిలో ఈ పదార్ధాలన్నిటినీ కలిపి... ప్రతి రోజూ రెండు మూడు సార్ర్లు కర్రతో కలియ తిప్పాలి. 48 గంటల తర్వాత వాడుకోవచ్చు. ఈ జీవామ్రుతం ఒక ఎకరానికి సరిపోతుంది. పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పొలం మొత్తనికీ జీవామ్రుతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు లేద30 రోజులకు ఒక సారి జీవామ్రుతన్ని నీటితో పాటు అందించాలి. దీని ద్వారా భూమిలోని జీవరాశి పెంపొంది, ఆరోగ్యవంతమవుతుంది. ఆరొగ్యవంతమైన భూమి మొక్కలకు పోషకాలను అందిస్తుంది ఇల మంచి దిగుబడులు సాధించవచ్చు.    



 
జీవామ్రుతం పిచికారీ చేసే పద్ధతి

3 నెలల్లో (60 నుంచి 90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకూ: ఎకరానికి
మొదటసారి: (విత్తనం నాటిన 1 నెలకి) 5 లీటర్ల జీవామ్రుతం, 100 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి.
రెండోసారి: (మొదటసారి పిచికారీ చేసిన 21 రోజుల తరువాత) 10 లీటర్ల జీవామ్రుతం, 150 లీటర్ల నీతిని పిచికారి చేయాలి.
మూడోసారి: (రెందోసారి పిచికారీ చేసిన 21 రోజుల తరువాత) 20 లీటర్ల జీవామ్రుతం, 200 లీటర్ల నీరు పిచికారీ చెయాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుదు - మిల్కింగ్ స్తేజ్) 5 లీటర్ల మజ్జిగ, 200 లీటర్ల నీతిని కలిపి పిచికారీ చేయాలి. చివరిసారి జీవామ్రుతం అవసరం లేదు.

0 comments:

Post a Comment