వ్యవసాయం మానవ నాగరికతకు మూలం. మారుతున్న పిరిస్థితులకు అనుగిణంగా వ్యవసాయం పద్ధతులను మార్చుకుంటున్నం. మన దేశానికి స్వాతంత్రయం రాక మునుపు పశువులను ఆధారం చేసుకొని వ్యవసాయం సాగిస్తూ వచ్చాం. శ్రుస్టిలో జీవరాశులన్ని సహ సంబంధంలో జీవించేవి. జనాభా పెరుగుతూ వచ్చింది. పండిస్తున్న పంటలు సరిపోని పరిస్థితి ఏర్పడిందని హైబ్రీడు విత్తనాలు, రసాయన ఎరువులు ఉపయోగించి ఎక్కువ దిగుబడి సాధించాలనుకున్నం... సాదించాం. కాని..... దిగుబడి పెరుగుతున్నదని ఆనందించామే గానీ... ప్రక్రుతి ఈమవుతున్నదని ఆలోచించలేకపోయాం. పొంటలకు చేడపీడలు ఆశించాయి. కావలసిన మొతాదులో పశువుల పేడ అందించకుండా... పూర్తిగా రసాయన క్రిమిసమహారక మందులు వాడడం మొదలు పెట్టాం. దిగుబది పెరుగుతున్నట్టు మొదట్లో అనిపించినా క్రమంగా తగ్గుముఖం పట్టింది. పెట్టుబడి తడిసి మోపెడైంది. రాబడి తగ్గింది. మనం ఏదో తప్పు చేస్తున్నమనే ఆలోచన మొదలైనది. దీనికి కారణాలు అన్వేషించాం.
పశువులు లేకుండా వ్యవసాయం చేయడం తప్పు అని తెలుసుకున్నం. పాడిని మరిచి పంటను పండించాలన్న ద్రుక్పధం లోపభూయిష్టమని గ్రహించాం. రసాయనిక ఎరువులు, క్రిమిసమ్హార మందులు వాడటం పూర్తిగా మానేసి... సేంద్రియ వ్యవసాయ పధతులు అనివార్యమని గ్రహించడంతో... సేంద్రియ వ్యవసాయం ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే, ఇందులో కూడా అనేక ఒడిదుడుకులు చవిచూస్తున్నం. పశువుల పేడ సరిపోయినంత లేక సతమతమవుతున్నం. సేంద్రియ వ్యవసాయ పద్దతి కూడా అధిక ఖర్చుతో కూడుకున్నదైనందున... సేంద్రియ వ్యవసాయం కూడా నస్టదాయకమైనదేనని నిర్ధారణకు వచ్చాం.
అటువంటి పెను సంక్షోభం ఊఅబిలో భారతీయ రైతాంగం కూరుకుపోయిన నేపధ్యంలో శ్రీ సుభష్ పలేకర్ గారు సునిశిత పరిశోధనతో రూపొందించిన పెట్టుబడి లేని ప్రక్రుతి వ్యవసాయం (Zero Budget Natural Farming) రైతాంగానికి వెలుగు బాట చూపింది. ప్రక్రుతి వ్యవసాయం చేయడానికి బండ్లకు బండ్లు పేడ అవసరం లేదు. ఒక్క దేశీయ ఆవు పేడ, మూత్రంతో 30 ఎకరాల్లో పంటలను ఆరొగ్యదాయకంగా పండించుకొవచ్చు. అటువంటి దివ్యమైన మర్గమే శ్రీ సుభష్ పలేకర్ గారు తెలియజేస్తున్న పెట్టుబడి లేని ప్రక్రుతి వ్యవసాయం. విషపూరిత రసయనాలను విచక్షణారహితంగా ఉపయోఅగించి ఇన్నాళ్ళు పుడమి తల్లిని నిర్జీవం చేసిన మనం... పెట్టుబడి లేని ప్రక్రుతి వ్యవసాయాన్ని నిండు మనసుతో అనుసరిద్దాం. దేశీయ ఆవు ద్వారా పుడమి తల్లికి జీవరాశులు అందించి ధాన్యరాశులు పండిద్దం. ప్రక్రుతిలో లభించే వనరులను మాత్రమే ఉపయోగించి పెట్టుబడి లేని వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాదిద్దం.

